Credit Card | క్రెడిట్ కార్డు దారులు జాగ్రత్త..
Credit Card | క్రెడిట్ కార్డు దారులు జాగ్రత్త..
సకాలంలో బిల్లు కట్టక పోతే బాదుడే..
లేట్ పేమెంట్‌కు అధిక ఛార్జీలు వసూలుకు బ్యాంకులకు అధికారం
క్రెడిట్ కార్డు దారులకు సుప్రీంకోర్టు హెచ్చరికలు
Hyderabad : సకాలంలో బిల్లులు చెల్లించని క్రెడిట్ కార్డు దారుల నుంచి లేట్ ఛార్జీలు అధికంగా వసూలు చేసుకునే అధికారాలు ఆయా బ్యాంకులకు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరింది. దీంతో క్రెడిట్ కార్డు దారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
అయితే క్రెడిట్ కార్డు వాడేవారికి ఒక విధంగా చేదు వార్త అన్నట్లే. వారంతా, ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిందే. భారతదేశంలోని లక్షలాది మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై ఈ తీర్పు ప్రభావం చూపనుంది. అయితే ఆ తీర్పు సారాంశం ఏమంటే..
బిల్లులు ఆలస్యంగా చెల్లించేవారు ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే వడ్డీల మోతకు బలవ్వాల్సిందే. ఎందుకంటే, క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై ఇప్పటివరకూ ఉన్న 30% పరిమితిని తొలగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది . తద్వారా, బ్యాంకులు అధిక ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో లేటుగా బిల్లు చెల్లించే క్రెడిట్ కార్డు హోల్డర్లుపై ఆర్థిక భారం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆలస్య బిల్లు చెల్లింపులపై క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను ఏటా 30% పరిమితం చేస్తూ 2008లో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) తీర్పును సుప్రీంకోర్టు డిసెంబర్ 20న రద్దు చేసింది. వడ్డీ రేట్లను నిర్ణయించుకునే అవకాశం బ్యాంకులకే కల్పిస్తూ తీర్పు వెలువరించింది. ఎన్‌సిడిఆర్‌సి తీర్పును పక్కన పెట్టడంతో.. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు లైన్ క్లియర్ అయింది.
క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను పరిమితం చేసే అధికారం NCDRC లేదని సవాలు చేశాయి.. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, హాంకాంగ్ తో పాటు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (HSBC)లు. 30% పరిమితిని ఎత్తివేయాలని న్యాయమూర్తులు బేలా త్రివేది, జస్టీస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశాయి.
అయితే 25 మార్చి 2008 నాటి NCDRC ఉత్తర్వును రద్దు చేస్తూ సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయం వల్ల క్రెడిట్ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో క్రెడిట్ కార్డు వినియోగదారులు బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే అని, సకాలంలో బిల్లులు చెల్లించి అధిక వడ్డీ భారం పడకుండా చూసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
* * *
Leave A Comment